0

పెరిగి విరిగితి - గురజాడ

Posted by Chaithanya on 20:48 in
పెరిగి విరిగితి
విరిగి పెరిగితి
కష్టసుఖముల
సారమెరిగితి

కొత్తమిన్కుల

తెలివితేటల
మంచి చెడ్డల
మార్చితిన్‌!


by
గురజాడ


0

'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ' - గురజాడ

Posted by Chaithanya on 20:42 in




'కన్నుల కాంతులు
కలువల చేరెను
మేలిమి చేరెను
మేనిపసల్‌
నడకల బెళుగులు
హంసల చేరెను
దుర్గను చేరెను
పూర్ణమ్మ
'

* గురజాడ 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ'. ముగింపు


0

చాటువులు

Posted by Chaithanya on 04:35 in

  • నక్కలు బొక్కలు వెదకును
      నక్కర తో నూర పంది యగడిత వెదకున్
      కుక్కలు చెప్పులు వెదకును
      దక్కడి నా లంజె కొడుకు తప్పే వెదకున్
 
  • నెమలిపురి యమపురాయెను
    యముడాయెను బసివిరెడ్డి, యెటుజూచినయున్
    యమధూతలైరి కాపులు
    క్రమమెరుగని దున్నలైరి కరణాలెల్లన్
 

0

మాలనేనగుదున్‌

Posted by Chaithanya on 04:20 in

''మంచిచెడ్డలు రెండె కులములు
మనుజులందున ఎంచిచూడగ
మంచియన్నది మాలయగుతే... మాలనేనగుదున్‌'
'
 
                                    - గురజాడ



0

About Poetry -by Octavio Paz

Posted by Chaithanya on 01:31 in , ,

There can be no society without poetry, 
but society can never be realized 
as poetry, it is never poetic. 
Sometimes 
the two terms seek to break apart. They cannot.
                                        
                                           .......Octavio Paz



0

ఎదురెదురుగా రెండు శరీరాలు -by 'Octavio Paz'

Posted by Chaithanya on 01:21 in , ,

"ఎదురెదురుగా రెండు శరీరాలు
రాత్రి సముద్రంలో అప్పుడప్పుడు రెండు అలలు


ఎదురెదురుగా రెండు శరీరాలు
రాత్రి ఎడారిలో ఒక్కోమారు రెండు రాళ్ళు

ఎదురెదురుగా రెండు శరీరాలు
రాత్రిలో అల్లుకుని అప్పుడప్పుడు రెండు వేర్లు

ఎదురెదురుగా రెండు శరీరాలు
రాత్రి తట్టే మెరుపులు ఒక్కోమారు రెండు కత్తులు

ఎదురెదురుగా రెండు శరీరాలు
శూన్యాకాశంలో రాలుతున్న రెండు నక్షత్రాలు
"


---------------- by 'Octavio Paz'

0

ఓ కవీ....


కవీ....

మనిషి కన్నీరు తుడవటం నీవంతు
శరీరం పోయినా నిలిచేది నీ గొంతు


----------"గుంటూరు శేషేంద్రశర్మ"


0

వియత్నాం -by Wisława Szymborska

Posted by Chaithanya on 01:08 in , ,


 ‘స్త్రీ, నీపేరేమిటి?’ - ‘నాకు తెలియదు’

‘నీ వయస్సెంత? ఎక్కడ్నుంచి వచ్చావు?’ - ‘నాకు తెలియదు’

‘ఆ కందకం ఎందుకు తవ్వుతున్నావు?’ - ‘నాకు తెలియదు’

‘ఎన్నాళ్ళనుండి దాగున్నావు?’ - ‘నాకు తెలియదు’

‘నా వేలు ఎందుకు కొరికావు’ - ‘నాకు తెలియదు’

‘మేము నీకు ఏ హానీ చేయమని తెలియదా?’ - ‘నాకు తెలియదు’

‘నువ్వు ఎవరివైపు ఉన్నావు?’ - ‘నాకు తెలియదు’

‘ఇది యుద్ధం, నువ్వేదో ఒకటి తేల్చుకోవాలి’ - ‘నాకు తెలియదు’

‘నీ గ్రామం ఇంకా ఉందా?’ - ‘నాకు తెలియదు’

‘వాళ్ళు నీ పిల్లలేనా?’ - ‘అవును’

 

............................ by "Wisława Szymborska"

0

మారనివాడు

Posted by Chaithanya on 01:01 in

వాడా? వాడు?
వాడు చచ్చినా మారడు!
మనిషి మారినా,
సమాజం మారినా,
లోకమే మారినా, వాడు మాత్రం మారడు?


(* "బోయి భీమన్న " ..‘మారనివాడు’ కవిత నుండి ......)


0

చూడు....


చూడు చరిత్ర చెత్తకుప్పల్లో
ఎన్నో హిట్లర్‌ తలకాయలు
ఎన్ని పిడుగులైనా పడనీ,
ఎన్ని భూకంపాలైనా రానీ,
ఏ పూలు పూయాలో
అవి పూయక తప్పదు


 ......."గుంటూరు శేషేంద్రశర్మ"

0

The Appeal -by Rudyard Kipling

Posted by Chaithanya on 00:52 in ,
నేను చేసిందేదైనా
మీకు సంతోషాన్ని ఇచ్చి ఉంటే
ఆ రాత్రి నన్ను హాయిగా పరుండనివ్వండి

అది తిరిగి మీదే.
కొద్దిసేపే ఐనా
పోయినవాళ్ళు మనస్సులో మెదుల్తారు
ఇక ఏ ప్రశ్నలూ అడగొద్దు
నేను వదలిపోయిన పుస్తకాల్ని తప్ప


 - by "Rudyard Kipling"


0

దేవుడా రక్షించు..... by తిలక్


దేవుడా
రక్షించు నాదేశాన్ని
పవిత్రులనుండి, పతివ్రతలనుండి
పెద్దమనుషుల నుండి, పెద్దపులులనుండి
నీతుల రెండునాల్కలు సాచి బుసలుకొట్టే
నిర్హేతుక కృపా సర్పాలనుండి
లక్షలాది దేవుళ్లనుండి వారి పూజారులనుండి
వారి వారి ప్రతినిధుల నుండి
సిద్ధాంత కేసరులనుండి
శ్రీమన్మద్గురు పరంపరనుండి
................"దేవరకొండ బాలగంగాధర తిలక్"



0

దోపిడీదారుడా!!! - Ageya కవిత్వం

Posted by Chaithanya on 00:44 in ,

దోపిడీదారుడా!!!

దోపిడీదారుడా భయపడకు తాగు
నా రక్తం తాజాగా, తియ్యగా ఉంటుంది ఆహ్లాదాన్ని పంచుతుంది...
బహుశా నీకు అరగకపోవచ్చు
నీ బొజ్జని ఒకసారి చూసుకో నా తప్పేం ఉంది
నా రక్తం తియ్యగా, పలుచగా, తేలికగా ఉంటుంది
కానీ నీ అనారోగ్యానికి మాత్రం నేను బాధ్యుణ్ణి కాదు..
భయపడకు నన్ను చూసి నువ్వేం బెదురుతావు
కానీ కాలం బలమైంది’.


by
Ageya



0

ఇళ్ళు .. by Kurup

Posted by Chaithanya on 00:38 in ,

ఇళ్ళు
-----

ప్రతి చోట ఓ ఇల్లుంది నాకు
నేనూ, నా అసంపూర్తి కవితా
అక్కడ ఉంటూంటాము
నేను కలుసుకోవాలనీ
జీవనానందాన్ని పంచుకోవాలని
తహా తహాలాడిన
మంచి వారున్న ప్రతి చోటా
నాకో ఇల్లుంది


by
Kurup

0

వేమన వేదం - 1

Posted by Chaithanya on 00:31 in

  • పలుగురాళ్ళు దెచ్చి పరగ గుడులు కట్టి
    చెలగి శిలల సేవ జేయనేల?
    శిలల సేవ జేయ ఫలమేమికలుగురా?
    విశ్వదాభిరామ వినురవేమ.
     
  • పాలకడలిపైన పవ్వళించినవాడు
    గొల్ల ఇండ్ల పాలు కోరనేల?
    ఎదుటివారి సొమ్ము ఎల్ల వారికి తీపి
    విశ్వదాభిరామ వినురవేమ.
     
  • కనక మృగము భువిని కద్దులేదనకుండ
    తరుణి విడిచిపోయె దాశరధియు
    తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?
    విశ్వదాభిరామ వినురవేమ.
     
  • కోతి నొకటిదెచ్చి క్రొత్తపుట్టముగట్టి
    కొండమ్రుచ్చులెల్లఁ గొలిచినట్లు
    నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు
    విశ్వదాభిరామ వినురవేమ.
    చాకి కోకలుదికి చీకాకుపడజేసి
    మైల దీసి లెస్స మడిచినట్లు
    బుద్ది చెప్పువాడు గుద్దితేనేమయా
    విశ్వదాభిరామ వినురవేమ.
     
ఒరుని జెఱచెదమని యుల్లమందెంతురు
తమకు జేఱురుగని ధరణీ నరులు
తమ్ముఁ జెఱుచువాడు దైవంబులేడొకో
విశ్వదాభిరామ వినురవేమ. 

*లోకములో మనుషులు తమకు వచ్చే కష్టాలను నష్టాలను పట్టించుకోక ఇతరులు ఎప్పుడు నాశనం అవుతారా అని చూస్తూ వారికి చెడు చేద్దామనే తలంపుతోనే ఉంటారు.ఇటువంటి తలంపుతో ఉంటే దైవము ఊరుకుంటాడా? వారు ఇతరులకు తలపెట్టే చెడు వారికే సంక్రమించేటట్లు చేస్తాడు.కానీ పాపం అజ్ఞానులు ఈ విషయాన్ని గ్రహించలేరు.

0

గురజాడ మాట..

Posted by Chaithanya on 23:50 in
''మనిషి చేసిన రాయిరప్పకి
మహిమ కలదని సాగిమెక్కుతు
మనుషులంటే రాయిరప్పల కన్న
కనిష్టం గాను చూస్తావేల బాలా?
దేవుడెకడో దాగెనంటూ కొండకోనల వెతుకులాడే వేలా?
కన్ను తెరిచిన కానబడడో
మనిషి మాత్రుడియందు లేడో
యెరిగి కోరిన కరిగి యీడో - ముక్తి
'' ....గురజాడ అప్పారావు


0

చలం ఆత్మకథకు - చలం ముందుమాట

Posted by Chaithanya on 23:40 in
 
 
ఆత్మకథలంటే నాకసహ్యం. ఆత్మకథ వ్రాయడమంటే తను లోకానికి ముఖ్యమైన మనిషైనట్టు, తానేదో ప్రజలకి తీరని ఉపకారం చేసినట్టు, తన సంగతి చెప్పుకోకపోతే లోకానికి తన గొప్ప తెలియనట్టు, తెలియకపోతే లోకానికి నష్టమైనట్టు అనుకొంటున్నాడన్నమాట, రాసినవాడు. ఎందుకు పుట్టానా? పుట్టినవాణ్ణి చప్పున చావక ఎందుకింత కాలం తన పరిసరాలని ఇంత కల్మషం చేశానా అనుకునే నావంటివాడు తనకథ సిగ్గులేకుండా చెప్పుకొంటున్నాడంటే ఏమాత్రం క్షమించదగిన విషయం కాదు


0

ఆర్తగీతం

  • ఆర్తగీతం by "దేవరకొండ బాలగంగాధర తిలక్"
    -----------------------------------------------------

    ఒక్క నిరుపేద ఉన్నంతవరకు
    ఒక్క మలినాశ్రు బిందు వొరిగినంతవరకు
    ఒక్క ప్రేగు ఆకలి కనలినంతవరకు
    ఒక్క శుష్కస్తన్య సన్నిధిని క్షుధార్తి నేడ్చు పసిపాప ఉన్నంతవరకు
    ఒక్క తల్లి నీరవాక్రోశరవమ్ము విన్నంతవరకు
    నాకు శాంతి కలుగదింక నేస్తం ,నేను నిగర్వినైనాను.
    ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను
    . “


0

నడక

Posted by Chaithanya on 23:31 in
"నడక"-------- కొండేపూడి నిర్మల
-------------------------------------

నడవడం కోసం పుట్టానో,
నడిపించడం కోసం పుట్టానో
ఎప్పుడూ ఆలోచించలేదు
మొత్తానికి ఏదో ఒక మగవాణ్ణి నడిపించడం కోసం
ఏదో ఒక దూరం దగ్గర చెయ్యడం కోసం
నడవాలనే అనుకుంటున్నాను
ఎందుకంటే నా నడక నేనింకా మొదలు పెట్టలేదు

0

అదృష్టాధ్వగమనం


అదృష్టాధ్వగమనం - by "దేవరకొండ బాలగంగాధర తిలక్"
------------------------------------------------------------------

"ఎన్నెన్ని అఖాతాలు ఎన్ని అడ్డంకులు
ఎన్ని వేదనా వాదనాయుతమైన విశ్వాసాలు
ఈ గుండెలో ఎన్ని గాయాలు!
అన్నా!
నేనొక జ్వాలా వలయితుణ్ణి,దుఃఖితుణ్ణి
నాలోపల నా బాధలు
నా వెలుపల క్షతజగత్తు ఆక్రోశించిన కరుణా భీభత్సరవాలు
నిరంతర పరిణామ పరిణాహ జగత్కటాహంలో
సలసలకాగే మానవాశ్రుజలాలు !



0

ఠాగూర్‌ - గీతాంజలి నుండి...


''ఈ చిన్నపువ్వును త్రెంచి తీసుకో, ఆలస్యం చేయకు!
అది ముడుచుకుని మట్టిలో కలిసిపోతుందని నా భయం,
నీ పూలమాలలో నాకు స్థానముండకపోవచ్చును,

కానీ నీ చేతి స్పర్శ శ్రమతో దానిని త్రెంచు,
కాలం కరిగిపోతుందేమోనని నా భయం
నాకు తెలియకనే, సేవించే సమయం దాటిపోతుందేమోనని.

దీనిరంగు గాఢమైనది కాదు
మరి, దీని వాసన మందమైనదే,
ఈ పువ్వుని నీ సేవకై వినియోగించు
సమయమున్నప్పుడే దీనిని త్రెంచుకో
''

-- "రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ - గీతాంజలి నుండి"

0

పిడికెడు ఆత్మగౌరవం కోసం..

Posted by Chaithanya on 23:18 in

"పిడికెడు ఆత్మగౌరవం కోసం.." by కలేకూరి ప్రసాద్
-------------------------------------------------------

నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ
వేల ఏళ్ల క్రితం ఈ గడ్డమీదనే చంపబడ్డాను

‘పునరపి మరణం పునరపి జననం’
నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ
మళ్లీ మళ్లీ మరణించిన
చోటనే పుడుతున్నాను
నాదేశం ఈ దేశంలో కరిగిపోయి
గంగా సింధూ మైదానమయ్యింది
నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే
ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి

నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే
ఈ దేశం సస్యశ్యామలమై సిరులు కురిసింది

త్రేతాయుగంలో నేను శంభూకుణ్ని
ఇరవై రెండేళ్ల క్రితం
నా పేరు కంచికచర్ల కోటేశు
నా జన్మస్థలం కీలవేణ్మణి,
కారంచేడు, నీరుకొండ
ఇప్పుడు కరుడుకట్టిన భూస్వామ్య క్రౌర్యం
నా గుండెల మీద నాగేటి కర్రులతో
పచ్చబొడిసిన పేరు చుండూరు
ఇక చుండూరు నామవాచకం కాదు
సర్వనామం

ఇప్పుడు ప్రతి గుండే ఒక చుండూరు,
రగిలే రాచపుండూరు
నేను జన సమూహాల గాయాన్ని
గాయాల సమూహాన్ని
తరతరాలుగా స్వతంవూతదేశంలో
అస్వతంవూతుణ్ణి
అవమానాలకూ, అత్యాచారాలకూ,
మానభంగాలకూ, చిత్రహింసలకూ గురై
పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తిన వాణ్ణి
ధనమదాంధ కులోన్మత్తుల రాజ్యంలో
బతకడమే ఒక నిరసనగా బతుకుతున్న వాణ్ణి
బతికేందుకు పదేపదే చస్తున్నవాణ్ణి

నన్ను బాధితుడని పిలువకండి
నేను అమరుణ్ణి,
నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి!

లోకానికి సంపదల్ని మిగిల్చేందుకు
క్షామాన్ని మింగిన
గరళ కంఠుణ్ణి నేను
శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని
నిటారుగా నిలబె
సూర్యుడి నెత్తి మీద యీడ్చితన్నిన వాణ్ణి
రగిలే గుండె కొలిమిలో
నినాదాలు కురిపిస్తున్న వాణ్ణి

నాకు జాలిజాలి మాటలొద్దు
కన్నీటి మూటలొద్దు
నేను బాధితుణ్ణి కాదు అమరుణ్ణి
ఎగిరే ధిక్కార పతాకాన్ని

నాకోసం కన్నీరు కార్చకండి
మీకు చేతనైతే
నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి

జీవన రవళిని వినిపించే
వెదురువనాన్నయి వికసిస్తాను

నా శవాన్ని ఈ దేశం
ముఖచివూతంగా ముద్రించండి
చరిత్ర పుటల్లోకి సుందర
భవిష్యత్తునై పరివ్యాపిస్తాను

ఒక పెనుమంటల పెనుగులాటనై
మళ్లీ మళ్లీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను



0

అవకాశం కన్పించకపోతే...


"ఒకదారిలో అవకాశం కన్పించకపోతే
మరొక దారిలో అది దొరుకుతుంది.
కానీ.....మనం
అవకాశంలేని దారివైపే చూస్తుంటాం
అవకాశం ఉన్న మార్గాన్ని గుర్తించలేం!!!!
"

..................."అలెగ్జాండర్ గ్రహం బెల్ "



0

మహాప్రస్థానం - యోగ్యతా పత్రం లో...

Posted by Chaithanya on 22:55 in

"తనకీ, ప్రపంచానికీ, సామరస్యం కుదిరిందాకా
కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వం
"

- చలం (శ్రీశ్రీ - మహాప్రస్థానం - యోగ్యతా పత్రం లో)

0

ఒక ఉదయం పూదోటలో...

''ఒక ఉదయం పూదోటలో
అంధురాలైన ఒక అమ్మాయి వచ్చింది
పద్మపత్రంలో పూలమాలను
నాకివ్వడానికి తెచ్చింది
దానిని నా మెడలో వేసుకొన్నాను
నా కళ్ళలో కన్నీళ్ళు వచ్చాయి.
ఆమెని ముద్దిడుకొని అన్నాను,
పూలలా నీవూ అంధురాలివి,
నీకు తెలియదు నీ కానుక ఎంత అందమైనదో
''
..........................................."రవీంద్రనాథ్‌ ఠాగూర్‌"

Copyright © 2009 Chaithu's Library All rights reserved. Theme by Laptop Geek. | Bloggerized by FalconHive.