0
ఠాగూర్ - గీతాంజలి నుండి...
''ఈ చిన్నపువ్వును త్రెంచి తీసుకో, ఆలస్యం చేయకు!
అది ముడుచుకుని మట్టిలో కలిసిపోతుందని నా భయం,
నీ పూలమాలలో నాకు స్థానముండకపోవచ్చును,
కానీ నీ చేతి స్పర్శ శ్రమతో దానిని త్రెంచు, కాలం కరిగిపోతుందేమోనని నా భయం
నాకు తెలియకనే, సేవించే సమయం దాటిపోతుందేమోనని.
దీనిరంగు గాఢమైనది కాదు
మరి, దీని వాసన మందమైనదే,
ఈ పువ్వుని నీ సేవకై వినియోగించు
సమయమున్నప్పుడే దీనిని త్రెంచుకో''
-- "రవీంద్రనాథ్ ఠాగూర్ - గీతాంజలి నుండి"

Post a Comment